PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్యకర్తలు పార్టీకి పునాది లాంటివారు..

1 min read

ఆశావహులు నిరుత్సాహ పడవద్దు తప్పకుండా న్యాయం జరుగుతుంది

ఎఐసిసి ఎన్నికల పరిశీలకుడు వి శంకర్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    కార్యకర్తలు పార్టీకి పునాది లాంటి వారని కార్యకర్తలు లేనిది పార్టీ లేదని ఆశావహులు నిరుత్సాహ పడవద్దని తప్పకుండా న్యాయం జరుగుతుందని జాతీయ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకుడు వి శంకర్ గారు అభిప్రాయపడ్డారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం మరియు సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశంలో శంకర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అవకాశవాదులు పార్టీలు మారిన స్వచ్ఛమైన కార్యకర్తలు మాత్రం మిగిలారని కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్నారని అలాంటి వారికి పార్టీలో సముచిత స్థానం తప్పకుండా కలుగుతుందని కార్యకర్తలకు భరోసా నిచ్చారు. పార్టీ కోసం పని చేసిన వారు టికెట్ల విషయంలో ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవచ్చని కానీ ఒకరికి మాత్రమే అవకాశం లభిస్తుందని అలాంటప్పుడు సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలని నిరుత్సాహ పడవద్దని తెలియజేస్తూ ఏఐసిసి పరిశీలకులుగా మీ కర్నూలు జిల్లాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తప్పకుండా కలవాలని రెండు మూడు రోజుల్లో తప్పకుండా మీ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని అందరినీ కలుపుకొని సమిష్టిగా పనిచేయాలని సూచించారు. వారికి కొన్ని బాధ్యతలు అప్పగించాలని అలాంటప్పుడే వారు బాధ్యతగా పనిచేస్తారని, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులను ప్రతి అసెంబ్లీ నియోజక వర్గమునకు ఇద్దరిని పర్యవేక్షకులుగా నియమించాలని వారు ఆ నియోజకవర్గంలో పర్యటించి ఆ రిపోర్టును జిల్లా కార్యాలయమునకు మరియు స్థానిక కాంగ్రెస్ అభ్యర్థికి అందజేయాలని సూచించారు. మీ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బూత్ కమిటీలు అసంపూర్తిగా ఉన్నాయని బూత్ కమిటీలు తప్పకుండా రెండు మూడు రోజుల్లో పూర్తిచేసి జిల్లా కార్యాలయమునకు అందజేయాలని ప్రతిబూత్ కు ఒక ఏజెంటును నియమించి వారి ఫోన్ నెంబర్ను నమోదు చేయాలని సూచించారు. అధిష్టానం ప్రతి పార్లమెంటు నియోజక వర్గమునకు ఒక ఎన్నికల పరిశీలకుడిని నియమించిందని వచ్చే వారంలో కర్నూలు పార్లమెంటుకు  రాబోతున్నాడని అతను ప్రతి నియోజకవర్గంలో మండలంలో తాలూకాలో పర్యటించి స్థానిక ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అధిష్టానానికి నివేదిక పంపిస్తాడని. కనుక నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థులు తప్పకుండా చురుకైన అభ్యర్థులను బూత్ కమిటీలకు నియమించు కోవాలని వారికి కాంగ్రెస్ మేనిఫెస్టోను స్థానిక ప్రజలకు తెలియజేసే విధంగా సూచనలు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని మనమందరం కుటుంబ సభ్యులమని అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేయాలని ప్రతి కార్యకర్త కట్టుబడి పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈరోజు నుంచి ఒక ప్రణాళిక ప్రకారం గ్రామ గ్రామాన  పర్యటించి ప్రజలతో మమేకమవ్వాలని  సూచించారు. బూత్ కమిటీ ఏజెంట్లు చురుకుగా ఉంటే సరైన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. మొత్తానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు సమిష్టిగా కృషిచేసి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందామని రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేసుకోవడమే ప్రతి కార్యకర్త ఆశయమని తెలియజేశారు. అనంతరం డిసిసి అధ్యక్షులు కే బాబురావు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి పని చేయాలని అలాంటప్పుడే పార్టీలో క్రమశిక్షణ పెరుగుతుందని సీనియర్లకు పార్టీలో తప్పకుండా సముచిత స్థానం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అనంతరం కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పిజి రాం పుల్లయ్య యాదవ్ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు ప్రచారంలో కార్యకర్తలను నాయకులను కలుపుకొని ప్రచారాలు నిర్వహించాలని వారి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించి ప్రచారంలో ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల మ్యానిఫెస్టోను వివరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పీజీ రాం పుల్లయ్య యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థులు కోడుమూరు పి మురళీకృష్ణ కర్నూలు షేక్ జిలాని భాష ఎమ్మిగనూరు ఎం కాశీం వల్లి ఆదోని ఆలూరు ఏ నవీన్ కిషోర్ జి రమేష్ యాదవ్ మంత్రాలయం పిఎస్ మురళీకృష్ణరాజు డిసిసి గౌరవ అధ్యక్షులు ఉండవల్లి వెంకటయ్య స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పీజీ నరసింహులు యాదవ్ జిల్లా కాంగ్రెస్ ప్రణాళిక కమిటీ చైర్మన్ ఎస్ రామస్వామి డిసిసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం డిసిసి ఉపాధ్యక్షులు బి బతుకన్న షేక్ రియాజుద్దీన్ కే వెంకటరెడ్డి ఏవి నాయుడు దిలీప్ దోకా డిసిసి ప్రధాన కార్యదర్శులు షేక్ నవీన్ వినోద్ కుమార్, కురువ నరసింహులు కే సత్యనారాయణ గుప్త ఎన్ చంద్రశేఖర్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ ఈ లాజరస్ ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ వై మారుతి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల సేవాదళ్ జిల్లా అధ్యక్షురాలు ఏ వెంకట సుజాత సోషల్ మీడియా జిల్లా చైర్మన్ అమానుల్లా రాష్ట్ర ఓబిసి ప్రధాన కార్యదర్శి వెంకట రాముడు కోసిగి జిలాని, ఎస్సీ సెల్ ఎన్ సి బజారన్న మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖాద్రి పాషా సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏ లలిత డిసిసి కార్యదర్శులు జి వెంకటస్వామి ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఎం శశిధర్ యు శేషయ్య అబ్దుల్ హై బి సుబ్రహ్మణ్యం అభి నాయుడు మరియు వివిధ నియోజకవర్గాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

About Author