PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి

1 min read

పి.జి.ఆర్.ఎస్ వచ్చిన అర్జీలను గడవు లోపు పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకోండి.

అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి.

ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ

పల్లెవెలుగు వెబ్ ఆదోని: ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు. వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని అధికారులకు సూచించారు.

   మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని. : పెద్ద హరివాణం గ్రామంలో చెరువు నందు త్రాగునీరు కొరకు రెండు ఫిల్టర్లున్నవి ప్రస్తుతం సదరు ఫిల్టర్లు సరిగ్గా పనిచేయడం లేదు గ్రామంలో జనాభా సంఖ్య కూడా పెరిగిపోయినది దయతో ఆ ఫిల్టర్లను మరమ్మత్తులను చేయించి గ్రామంలో సరిపడా త్రాగునీరు అందించాలని గ్రామ ప్రజలు అర్జీ సమర్పించుకున్నారు.కౌతాళం మండలం ఇరిగేరి ఎరిగేరి ఏరిగేరి గ్రామానికి చెందిన భీమేష్ కి సంబంధించి సర్వేనెంబర్ 503/ఏ3డి నందు 2.75 ఎకరాల భూమి ఉండగా ప్రస్తుతం సదరు భూమి ఆన్లైన్ నందు 0.23 సెంట్లు చూపిస్తున్నది. దయతో విచారణ చేసి ఆన్లైన్ నందు నాకు భూమిని నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.ఆదోని మండలం గనేకల్ గ్రామానికి చెందిన సూరప్ప సంబంధించి సర్వేనెంబర్ 17జి నందు 2.14 ఎకరాల భూమి మరియు సర్వే నెంబర్ 70. జి నందు 2.28 ఎకరాల భూమి ఉండగా ప్రస్తుతం సదర భూమి ఆన్లైన్ నందు వేరే వారి పేరు నమోదైనది దయతో విచారణ చేసి నా యొక్క పేరు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు. పెద్దకడబూరు మండలం నౌలేకల్ గ్రామానికి చెందిన దేవదాసు కు సంబంధించి సర్వే నంబర్ 126/సి నందు 2.39 ఎకరాల భూమి ఉన్నది సదరు భూమిపై ఆర్వార్ అడంగల్ ఉన్నవి ప్రస్తుతం సదరు భూమి దేవాదాయ శాఖ భూమిగా చూపిస్తున్నది దయతో విచారణ చేసి న్యాయం చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.ఈ కార్యక్రమానికి కార్యాలయపు పరిపాలన అధికారి కే. వసుంధర,  డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వాయర్ వేణు సూర్య, డి ఎల్ డి వో నాగేశ్వరరావు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, ఆర్టీవో నాగేంద్ర, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవి కుమార్, తాసిల్దార్లు కుమారస్వామి, శ్రీనాథ్, ఉప తాసిల్దార్లు దీపా,పెద్దయ్య, వలి భాష, తదితరులు పాల్గొన్నారు.

About Author