ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించండి
1 min readపిజిఆర్ఏస్ కు 183 దరఖాస్తులు
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, డిఆర్ఓ రాము నాయక్, నంద్యాల ఆర్డీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారుఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి నాణ్యతతో నిర్ణీత కాల వ్యవధిలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటివరకు స్వీకరించిన 4480 దరఖాస్తులలో 3918 దరఖాస్తులను పరిష్కరించామని ఇంకా పెండింగ్ లో ఉన్న నిరీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన 540 దరఖాస్తులు వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి సోమవారం వచ్చిన ప్రజా ఫిర్యాదులు శనివారం లోపు పరిష్కరించేలా శ్రద్ధ తీసుకోవాలన్నారు. గతవారం 10 ప్రజా ఫిర్యాదులను వెబ్సైట్లో చూడలేకపోవటానికి గల కారణాలేంటిని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కరించలేని స్థితిలో జిల్లా అధికారులు ఉండకూడదని స్పష్టం చేశారు. నాణ్యమైన రీతిలో సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టర్, జెసి లాగిన్ లలో రీఓపెన్ అవుతాయని ఈ విషయాన్ని అధికారులందరూ దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి రెడ్రెస్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎమ్ఓ కార్యాలయపు ఫిర్యాదులు కూడ పెండింగ్ లో వుండకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. ఆడిట్ కూడా 98 శాతం రావాలని కలెక్టర్ సూచించారు. అధ్వానరీతిలో రెడ్రెస్ చేసిన ఆళ్లగడ్డ, పాణ్యం తాసిల్దార్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిఆర్ఓ ను కలెక్టర్ ఆదేశించారు. ఏపీ సేవా సర్వీసులలో 865 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేయాలన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన కొన్ని సమస్యలు
- జూపాడుబంగ్లా మండలం 80 బన్నురూ గ్రామ వాస్తవ్యుడు ప్రభాకర్ గ్రామ పొలిమేరలో తనకు సర్వే నెం. 455/B మరియు 105 లో భూమి ఉన్నదినీ… మ్యుటేషన్ చేసి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.2) బేతంచేర్ల మండలం బుగ్గానిపల్లె గ్రామ కాపురస్తూడు వెంకటేష్ కు బీసీ కాలనీ లో 26-3-237-4 నంబర్ గల ఇంటికి కొళాయి కనెక్షన్ నిమిత్తం 10,500 రూపాయలు కట్టినప్పటికీ ఇంతవరకు కనెక్షన్ మంజూరు కాలేదని…. కొళాయి కనెక్షన్ ఇప్పించవలసిందిగా కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు ను సమర్పించుకున్నారు.