PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆది కావ్యం రామాయణాన్ని మానవాళికి అందించిన మహనీయుడు మహర్షి వాల్మీకి

1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆది కావ్యం రామాయణాన్ని మానవాళికి అందించిన మహనీయుడు మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కొనియాడారు.గురువారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేటగాడైన రత్నాకరుని  నుండి మహర్షి వాల్మీకి గా  మారిన తీరును వివరించారు.  వారి  జీవిత చరిత్ర ఆధారంగా ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదని  తెలుస్తుందన్నారు.. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని లోకానికి చాటి చెప్పారని, రామాయణ మహా కావ్యం ద్వారా ధర్మబద్ధంగా ఎలా జీవించాలి అని మానవాళికి మార్గదర్శనం చేసిన ఆది కవి మహర్షి వాల్మీకి అని కలెక్టర్ కొనియాడారు.. వారిని గురువుగా, ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఇతరులకు సాయం చేసే తత్త్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.  మన కుటుంబ పోషణ తో పాటు  అవసరం ఉన్న వారిని ఆదుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు… రాష్ట్ర ప్రభుత్వం  బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోoదన్నారు. వాల్మీకులను  ఎస్టీలుగా పరిగణించాలని,  కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయాలని తదితర విషయాలను ప్రస్థావించారని, జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలను  పరిష్కరించేందుకు తమ పరిధిలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.  రాష్ట్రస్థాయిలో పరిష్కరించాల్సిన  సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారికంగా జరుపుకోవడం  సంతోషదాయకమని తెలిపారు. మహర్షి వాల్మీకి రామాయణం ద్వారా నిర్దేశించిన ధర్మ మార్గంలో  నడవాలని తెలియజేశారు. అంతకుముందు గౌరీ గోపాల్ హాస్పిటల్ సర్కిల్ వద్ద ఉన్న మహర్షి వాల్మీకి విగ్రహానికి జిల్లా కలెక్టర్, టూరిజం డైరెక్టర్ ముంతాజ్, బిసి సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్ ముంతాజ్, ఏపి సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు, ఏపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, బిసి సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, సహాయ కార్మిక శాఖ అధికారి సాంబశివరావు, వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తలారి కృష్ణమ్మనాయుడు, బేతం కృష్ణుడు, కుబేర స్వామి, బాల సంజన్న, సత్రం రామకృష్ణడు, గిడ్డియ్య, జె.శ్రీనివాసుల నాయుడు, ప్రొ.హనుమంతప్ప, జ్ఞానేశ్వరమ్మ, నక్కలమిట్ట శ్రీనివాసులు, గడ్డం రామకృష్ణ, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, సాంబశివరావు, వినోద్ కుమార్, రామచంద్రనాయుడు, మండ్ల శేఖర్, రవిశంకర్ నాయుడు, చౌడప్ప నాయుడు, శ్రీనివాస నాయుడు, వీరాంజనేయులు, బత్తుల లక్ష్మీకాంతయ్య, దేవపూజ ధనుంజయచారి, మల్లికార్జున నాయుడు బిసి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author