ఇల్లు లేని నిరు పేదలకు పక్క ఇల్లు మంజూరు చేయాలి
1 min read….. డి.రాజా సాహెబ్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం ఇచ్చి, పక్కా ఇల్లు మంజూరు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈనెల 18వ తేదీన పేదలకు, ఇళ్ల స్థలాలు గ్రామాలలో అయితే, మూడు సెంట్లు స్థలం, పట్టణాలలో అయితే రెండు సెంట్లు స్థలం ఇవ్వాలని ,అలాగే పక్క ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల దగ్గర జరిగే ధర్నాను, జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం రోజు పత్తికొండ పట్టణంలోని కోయ నగర్ రామకృష్ణారెడ్డి నగర్ గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి, ప్రజల దగ్గరకు వెళ్లి, సిపిఐ పార్టీ ,ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ముద్రించిన, ఇళ్ల స్థలాల అర్జీలను ,,పేదలకు ఇచ్చి కరపత్రాలను పంచుతూ, ధర్నాను జయప్రదం చేయాలని ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో ఎంతోమంది ,నిలువ నీడ లేనినిరుపేదలు ఇళ్ల స్థలాల కొరకు అనేకసార్లు అర్జీలు ,ధర్నాల రూపంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లిన ,ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన చెందారు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ,కూటమి ప్రభుత్వం ,ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఇల్లు నిర్మించుకునే వారికి 4 లక్షల రూపాయలు ఇంటికి సంబంధించిన ముడి సరుకుల సామాగ్రిని ఉచితంగా అందిస్తామని ప్రకటన చేస్తూ, అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదల దగ్గరకు వెళ్లి, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్జీలను, అర్హులైన నిరుపేదలతోనే పెట్టించి, ఈనెల 18న గ్రామ సచివాలయం ముందు సిపిఐ పీ వ్యవసాయ కార్మిక సంఘం,, ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, గ్రామ సచివాయలు.