సిల్వర్ జూబ్లీ కళాశాలలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు ఉన్న సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశల కోసం సిల్వర్ సెట్ 2024 నిర్వహిస్తున్నట్లు క్లష్టర్ యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ ప్రోఫెసర్ డీవీఆర్.సాయి గోపాల్ కర్నూలు లో తెలిపారు. కర్నూలు లో ఎంతో చరిత్ర ఉన్న సిల్వర్ జూబ్లీ కళాశాల లో చదివుకున్న విద్యార్థులు ఐఏఎస్. ఐపీఎస్ లతో పాటు ఉన్నతాధికారులు గా తయారైయ్యారని అలాంటి కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు ఎంట్రెన్స్ నిర్వహిస్తున్నామని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి సిల్వర్ సెట్ 2024 పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఈపరీక్షకు ఇంటర్ చదివిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు అర్హులు. ఈ పరీక్ష కు గడువు జూన్ 4వ తేదీ ఉండగా దానిని జూన్ 23వ తేదీ వరకు పొడగించారు. ఈపరీక్ష ను జులై 7వ తేదీ ఆన్ లైన్ విధానంలో అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఫ్రోఫెసర్. డీవీఆర్. సాయి గోపాల్ తెలిపారు.ఈకార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రోఫెసర్. డీవీఆర్. సాయి గోపాల్, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ డా.వీవీఎస్. కుమార్. వైస్ ప్రిన్సిపాల్ డా.ప్రసాద్ రెడ్డి, కన్వీనర్ డా.శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్. శ్రీనివాసులు,అడ్మిషన్ డైరెక్టర్ డా.మహమ్మద్ వాయిజ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి, వాణిజ్య శాస్త్రం అధ్యాపకులు డాక్టర్ దలవాయి శ్రీనివాసులు, అర్థశాస్త్రం అధ్యాపకులు డాక్టర్ ఎల్లా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.