ఆదోని అభివృద్ధి.. నా బాధ్యత
1 min readకూటమి అభ్యర్థి డా. పార్థసారధి
- కుమ్మరిగేరిలో 10 కుటుంబాలు… టీడీపీలో చేరిక
ఆదోని, పల్లెవెలుగు: పట్టణంలోని కుమ్మరిగేరి భార్ పేట కు చెందిన మాజీ కౌన్సిలర్ దూదేకుల పి మాబున్ని భర్త దస్తగిరి సాబ్ ఆధ్వర్యంలో 10 కుటుంబాలు మంగళవారం టీడీపీలో కి చేరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 10వార్డులో 2005లో కాంగ్రెస్ తరుపున కౌన్సిలర్ గా గెలుపొంది… ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని దస్తగిరి సాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలతోపాటు… స్థానిక ఎమ్మెల్యే దందాలు అధికమయ్యాయని, దీంతో విసిగిపోయిన ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు తోనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలంటే చంద్రబాబుతోనే సాధ్యం అని అన్నారు.
ఆదోని అభివృద్ధి.. నా బాధ్యత :డా. పార్థసారధి
మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని కోట్ల రూపాయలు గడించాడని, భూకబ్జాలు…దందాలు, ఇసుక, మద్యం, రేషన్ మాఫియాను పెంచిపోషించాడని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను గెలిపిస్తే ఆదోని అభివృద్ధి చూసి చూపిస్తానని పట్టణ ప్రజలు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, టీడీపీ నాయకులు బుద్దారెడ్డి, జనసేన నాయకులు మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.