దత్తత తీసుకున్న పిల్లలకు బంగారు భవిష్యత్ ను అందించాలి
1 min readసంతానంలేని దంపతులు పిల్లలను చట్టబద్ధంగా దత్తత తీసుకొనే అవకాశం
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దత్తత తీసుకున్న పిల్లలకు బంగారు భవిష్యత్ ను అందించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో ఏలూరు శిశుగృహం ద్వారా బేబి మహిమ 5 నెలల చిన్నారిని తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుకు చెందిన జగ్ మిదర్ సింగ్, సోనాల్ కౌర్ అనే దంపతులకు కారా నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్ వారి సమక్షంలో దత్తత ఇవ్వడం జరిగింది. ఈ దంపతులు 2020 లో ఆన్ లైన్ ద్వారా కారా నిబంధనలమేరకు దత్తతకోసం ధరఖాస్తు చేసుకొనియున్నారు. దత్తతకు ప్రతిపాధించిన బేబి మహిమను తమకు దత్తత కోసం కోరడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ దత్తత తీసుకున్న చిన్నారికి విద్యాబుద్ధులు అందించి బంగారు భవిష్యత్ కల్పించాలని సూచించారు. అనాధ పిల్లలకు బంగారు భవిష్యత్ ను అందించేందుకు ప్రభుత్వం చట్టబద్ధంగా పిల్లలను దత్తత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి కె.ఎ.వి.ఎల్. పద్మావతి, డిసిపివో సిహెచ్ సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు.