పేరుకే విద్యార్థులకు భోజనం.. వండిన తర్వాత పందులకు ఆహారం
1 min readఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి థామస్
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న మద్యాహ్న భోజనం వంట నిర్వాహకులు వండిన తర్వాత పందులకు ఆహారంగా మారిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి థామస్ అన్నారు. శనివారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ముందు ధర్నా చేశారు. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగిందని ఆయన తెలిపారు. దాదాపుగా పాఠశాలలో 1100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని మధ్యాహ్నం భోజనం సరిగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం. దీనికి సంబంధించి భోజనం ఎమ్మార్వో , హెడ్మాస్టర్ మరి విద్యార్థుల సంఘాలు సందర్శించగా శుభ్రత లేని వంటగది నాణ్యతలేని భోజనము 1100 మంది విద్యార్థులలో 150 మందివిద్యార్థులు కూడా భోజనం చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎం చేతివాటం ఏజెన్సీ అతి ఉత్సాహం వలన గ్రామీణ పేద విద్యార్థిని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వండినటువంటి భోజనాన్ని తహసిల్దార్ శేఖర్ కి చూపించడం జరిగింది ఆయన కూడా పూర్తిస్థాయి ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. వంట ఏజెన్సీ పైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థి నాయకులు శాంతించి ధర్నా న్ని వివరించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో ఎక్కడైనా పేద విద్యార్థులకు నాణ్యతలేని భోజనం ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరేష్, నాగరాజు, వినోద్, అరవింద్ విద్యార్థులు పాల్గొన్నారు.