2 లకారాలు ఇస్తే ఏజెన్సీ ఉద్యోగం…!
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: 2 లకారాలు ఇస్తే మహానంది దేవస్థానంలో ఏజెన్సీ ఉద్యోగులుగా నియమిస్తామని ప్రచారం జరుగుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఒకవైపు ఎలాంటి ఏజెన్సీ ఉద్యోగాలు ఖాళీలేవని బయటకి చెప్తున్నా లోలోపల మాత్రం క్షేత్రంలో ఏజెన్సీ ఉద్యోగం పొందాలంటే రెండు లకారాలు చెల్లించాల్సిందే అని అధికార పార్టీకి చెందిన ఒక మూలవిరాట్ ఒకరిపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇంతకు ఏజెన్సీ సిబ్బందికి జీతభత్యాలు ఎంత వారికి పర్మినెంట్ అవుతాయా, పర్మినెంట్ అవుతాయని నమ్మబల్కుతున్నది ఎవరు అనేది చర్చనీయామిశంగా మారినట్లు తెలుస్తుంది .