నర్సింగ్ కళాశాలలు కౌన్సిలింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమ అడ్మిషన్లు
1 min readఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ .. నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్
రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్లోని నర్సింగ్ కళాశాలల అక్రమాలు కౌన్సిలింగ్ కు విరుద్ధంగా అడ్మిషన్లు మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజుల దంద సోమవారం రోజున కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషాకి ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ .. నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు కర్నూల్ జిల్లాలోని నర్సింగ్ కళాశాలలు కౌన్సిలింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అక్రమ అడ్మిషన్స్ గురించి అదేవిధంగా ఎక్సమ్ ఫీజుల, బస్సు ఫీజుల, క్లినికల్ ఫీజుల విషయంలో నర్సింగ్ కళాశాల యాజమాన్యాలు పాల్పడుతతున్న అవినీతి గూర్చి, ఫీజుల దందా గూర్తి కలెక్టర్ కి వివరిచటం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ స్పందిస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని DMHO ని అదేశించటం జరిగింది. ఈ సందర్బంగా నర్సింగ్ నాయకుడు భాస్కర్ నాయుడు మీడియా తో మాట్లాడుతూ నర్సింగ్ వ్యవస్థలో అక్రమాలను అరికట్టని పక్షం లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము అని తెలియజేశారు.