మహానంది క్షేత్రంలో పొగాకు ఉత్పత్తుల వ్యర్థాల కలకలం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలోని ఒక ప్రధాన ఆలయంలో పొగాకు ఉత్పత్తుల వ్యర్థాలు కలకలం రేపుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. గత కొంతకాలం నుంచి పొగాకు ఉత్పత్తులను( చైనీకైనా) ఉపయోగించిన అనంతరం వ్యర్థాలను ప్రధాన ఆలయం ముందున్న కటాంజనం ప్రక్కన ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో వదిలి వేయడంతో పాటు వాటి వ్యర్థాలు ఆలయంలోని ప్రధాన కోనేరులో కి విసిరి వేయడం వేయడంతో పాటు ఖాళీ ప్రదేశంలో వదిలిన వ్యర్థాలు ప్రధాన కోనేటిలోకి కి చేరుతున్నట్లు ఆరోపణలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రధాన ఆలయంలో ఒక భాగంలోనికి ఎవరిని, ఏ భక్తులను అక్కడ పోవడానికి అనుమతించరు. కొందరు వీఐపీలు తప్ప. కానీ పొగాకు వ్యర్థాలు అక్కడికి ఎలా చేరుతున్నాయి ఎవరు ఉపయోగిస్తున్నారు అనేదానిపై చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఆలయంలో పనిచేసే ఒకరిద్దరు ప్రధాన వ్యక్తులు పొగాకు ఉత్పత్తులను వినియోగించిన అనంతరం గుట్టు చప్పుడు కాకుండా కట్టంజనం వైపు నుంచి ప్రధాన కోనేరులోకి వేయడంతో పాటు కట్టంజనం పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో వేస్తున్నట్లు తెలుస్తుంది. ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపల కారణంగా పొగాకు ఉత్పత్తులు ఆలయం లోపలికి తీసుకొని పోతున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. సాధారణంగా క్షేత్ర పరిధిలో పొగాకు ఉత్పత్తులు నిషేధం. దీనిని అతిక్రమించిన వారికి జరిమానా కూడా విధిస్తారు. కానీ క్షేత్రంలోని ప్రధాన ఆలయంలోనికి పొగాకు ఉత్పత్తులు ఎలా తీసుకో పోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తుంది. సాధారణంగా భక్తులు దేవుడితోపాటు గౌరవంతో, సంస్కారంలో భాగంగా కొందరికి నమస్కరిస్తారు. ఆలయ మర్యాదలను ,కీర్తి ప్రతిష్టలను కాపాడాల్సిన వ్యక్తులే ఒకరిద్దరూ ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు అవరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇలాంటివి బయటపడుతున్నట్లు తెలుస్తుంది .