హెచ్‌ఎమ్‌ఎ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ – ఏఎల్ రయాన్ ఎగ్జ్‌పోర్ట్‌తో ఒప్పందం
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : పర్యావరణ అనుకూలమైన ఆహార ఉత్పత్తుల్లో అగ్రగామిగా నిలిచిన హెచ్‌ఎమ్‌ఎ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిఎస్‌ఇ: 543929, ఎన్‌ఎస్‌ఇ: హెచ్‌ఎమ్‌ఏఎగ్రో) తాజాగా ఏఎల్ రయాన్ ఎగ్జ్‌పోర్ట్‌తో స్లాటరింగ్, చిల్లింగ్, ప్రాసెసింగ్, ఫ్రీజింగ్ మరియు ప్యాకింగ్ కోసం ఫెసిలిటీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇంతకుముందు, సెలాంగర్ వ్యవసాయ అభివృద్ధి సంస్థ (పికేపిఎస్)తో హెచ్‌ఎమ్‌ఎ అగ్రో ఎంఒయూ కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం మలేషియా సెలాంగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుల సమక్షంలో సంతకమైంది. ఈ భాగస్వామ్యం ద్వారా ఫ్రోజెన్ హలాల్ బోన్లెస్ బఫెలో మీట్ సరఫరా, సాంకేతిక సమస్యలపై పరిశోధనలు వంటి అవకాశాలను అన్వేషిస్తారు.హెచ్‌ఎమ్‌ఎ అగ్రో ఇండస్ట్రీస్ రోజుకు 1472 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆగ్రా, అలీగఢ్, మేవట్, ప్రాభణి వంటి ఆరు నగరాల్లో అత్యాధునిక తయారీ కేంద్రాలను కలిగి ఉంది. 63 సంవత్సరాల అనుభవం కలిగిన హెచ్‌ఎమ్‌ఎ 60 దేశాల్లో సేవలు అందిస్తోంది.ఈ భాగస్వామ్యాల ద్వారా హెచ్‌ఎమ్‌ఎ అంతర్జాతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరచుకొని, దీర్ఘకాలిక ప్రగతిని సాధించేందుకు దోహదపడనుంది.