డిమాండ్ మేరకు అన్ని పంటల విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలి
1 min readసిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్…..
మండల వ్యాప్తంగా ఆర్.బి.కెల దగ్గర రైతు సంఘం నిరసనలు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్న తరుణంలో వ్యవసాయానికి అవసరమైన విత్తనాలను ఎరువులను సమకూర్చడంలో ప్రభుత్వ యంత్రాంగం తగిన కృషి చేయట్లేదని, అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలను వెంటనే ఆర్ బి కే ల ద్వారా రైతాంగానికి అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ లు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు మండల రైతాంగానికి ఎరువులు విత్తనాలు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ తో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కమిటీలకు మేరకు మండలంలోని దేవనకొండ, పల్లె దొడ్డి ,కుంకునూరు, తెర్నేకల్లు, కోటకొండ ,నెల్లిబండ, కప్పట్రాళ్ల ,జిల్లెడు బుడుకల, చెలిమిచెలిమల గ్రామాల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లెడు బుడకల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ సంఘీభావంగా పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో కేవలం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని, పత్తి,కంది, సజ్జ, జొన్న వంటి ఇతర పంటల యొక్క విత్తనాలను కూడా ప్రభుత్వం వెంటనే ఆర్బికెల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో పత్తి పంట లు రైతులు ఎక్కువగా సాగు చేస్తారని, కావున పత్తి విత్తనాలను రైతులకు సబ్సిడీపై ఇవ్వాలని కోరారు. మార్కెట్లో పత్తి విత్తనాల కల్తీ విపరీతంగా పెరిగి పోయి జిల్లాలో రైతంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి విత్తనాల పంపిణీకి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలి.