కురవలందరూ కలిసి ఉండాలి. ..కురవ రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్. దేవేంద్రప్ప
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : కురవ కులస్తుల సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర కురవ కార్పోరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప కర్నూలు లో అన్నారు. కర్నూలు లోని బీరప్ప స్వామి దేవాలయం లో మాదారికురవ, మాదాసి కురువ సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా దేవేంద్రప్ప మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురవలకు సబ్సిడీపై లోన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకుని పోయామని అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. గొర్రెల కాపరులైన కురవలకు గొర్రెలను ఏర్పాటు చేసుకునేందుకు లోన్లు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కర్నూలు జిల్లాకు వంద గొర్రెల యూనిట్లు ఇచ్చారని మార్చి నెల తర్వాత ఇంకా పెంచుతామని దేవేంద్రప్ప అన్నారు. బీసీలందరికీ రెండు లక్షల రూపాయల సబ్సిడీ తో నాలుగు లక్షల రూపొయల లోన్ ఇస్తున్నారన్నారు. కార్పోరేషన్ చైర్మన్ లకు సైతం జీతాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. కురవ సంఘం నగర కమీటీ అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ 34 సంవత్సరాల అనుభవం ఉన్న ఏకైక సంఘం కురవ సంఘం అన్నారు. జిల్లా లో కురవలందరూ ఓకే సంఘంలో ఉండి కులస్థుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కర్నూలు ఎంపీ సీటు ను కురవలకు రావడానికి కురవ సంఘం ఎంతో కృషి చేసిందన్నారు.