ప్రజలంతా డిపాజిట్ ఖతాల గురించి తెలుసుకోవాలి
1 min readఆర్థిక ప్రణాళిక మరియు బడ్జెట్ గురించి అవగాహన కలిగి ఉండాలి
కర్నూలు జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామచందర్రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీలో రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా జిల్లా లీడ్ డిస్టిక్ మేనేజర్ రామచంద్రరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఖాతాదారులు వివిధ డిపాజిట్ ఖతాల గురించి తెలుసుకోవాలి అని ప్రతి ఒక్క పౌరుడు ఆర్థిక ప్రణాళిక మరియు బడ్జెట్ పై అవగాహన కలిగి ఉండి తప్పకుండా పాటించాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమo ను ఉద్దేశించి UBI బ్యాంకు మేనేజర్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని డిజిటల్ పేమెంట్స్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని, మీ యొక్క ఓటీపీ పిన్ నెంబర్లు వ్యక్తిగత వివరాలు ఇతరులతో పంచుకోకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కిరణ్మయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత పొదుపు అనేది చాలా ముఖ్యం అని మరియు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన జీవనజ్యోతి బీమా యోజన తప్పకుండా నమోదు చేసుకోవాలి అని చెప్పారు.ఈ వర్క్ షాప్, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అధ్వర్యములో, ప్రాజెక్టు డైరెక్టర్ వి.ఆంజనేయులు మరియు ప్రాజెక్ట్ మేనేజర్ వి.అశోక్ కుమార్ పర్యవేక్షణ లో నిర్వహించ డమైనది.అలాగే ఈ కార్యక్రమంలో ట్రైనర్ అశోక్ మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ,కేవైసీ, నామిని, DICGC గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా రిసోర్స్ పర్సన్ నబీ రసూల్ మాట్లాడుతూ విద్యాలక్ష్మి , ఉద్గం పోర్టల్ గురించి తెలియజేయడం జరిగినది . ఈ కార్యక్రమం ఉద్దేశించి రిసోర్స్ పర్సన్ రమేష్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యక్తి కూడా పొదుపు పట్ల అవగాహన కలిగి ఉండాలని బడ్జెట్ ఏ విధంగా చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగినది. చివరిగా ప్రోగ్రాం కోఆర్డినేట్ పులికొండ మాట్లాడుతూ డిపాజిట్ ఖాతాలతో కలిగేటువంటి అదనపు ప్రయోజనాల గురించి వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాయలసీమ విశ్వవిద్యాలయ గణిత శాస్త్రం హెచ్ ఓ డి వెంకట ఆనందపుచ్చయ్య , కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి రవికుమార్ , కంప్యూటర్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ రాజేశ్వరి మేడం , ఇతర అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగినది.