పది ఫెయిల్ అయిన విద్యార్థులందరూ సప్లిమెంటరీ పరీక్షకు హాజరవ్వవచ్చు
1 min readమండల విద్యాశాఖ అధికారి, మేరి సునీత.
పల్లెవెలుగు వెబ్ గడివేముల : స్థానిక ఎంఈఓ కార్యాలయంలో మంగళవారం నాడు జరిగిన సమావేశంలో, మండల విద్యాశాఖ అధికారి మేరి సునీత మాట్లాడుతూ, ఈనెల 24వ తేదీ నుంచి జరగబోయే పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షకు, మార్చి 2024 లో పరీక్ష ఫీజు చెల్లించి, ఫెయిలైన మరియు పరీక్షకు హాజరుకాని విద్యార్థులందరూ పరీక్ష ఫీజు చెల్లించకపోయినను ఈ సప్లిమెంటరీ పరీక్షకు హాజరవుటకు అర్హులని, సంబంధిత విద్యార్థుల హాల్ టికెట్లు అందుబాటులో కలవని తెలియజేయడం జరిగింది. కాబట్టి అలాంటి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షకు హాజరై ఉత్తీర్ణులవ్వాలని తెలిపారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాల యొక్క సిలబస్ మారుతుంది. కావున ఈ అవకాశాన్ని అందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ తెలిపారు.