కార్తిక మాసంలో మహానందికొచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: నవంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం అయ్యే కార్తీక మాసంలో మహానందికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మహానంది దేవస్థానం కార్య నిర్వహణ అధికారి నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి గురువారం పేర్కొన్నారు. మహానంది దేవస్థాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు వచ్చాయని అన్నారు. భక్తులకు త్రాగునీరు క్యూలైన్ల ఏర్పాట్లు భక్తులకు కావాల్సిన ప్రసాదాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని మౌలిక వసతులు భక్తులకు కల్పిస్తున్నామని కార్తీక మాసంలోని సోమవారాల్లో క్షేత్రంలో నోములు నోచుకునే వారికి సంబంధించి 200 రూపాయలు టికెట్ పొందాలని సూచించారు. మిగిలిన టికెట్ల ధరలు యధావిధిగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు తదితరులు పాల్గొన్నారు .