PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆళ్ల నాని నామినేషన్..

1 min read

ఎస్సీ, బీసీ, మైనార్టీలు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలి..

వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి

పెరికె వరప్రసాదరావు పిలుపు

మచ్చలేని నాయకుడు, నిస్వార్థ ప్రజా సేవకుడు ఆళ్ళ నాని

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏప్రిల్ 18 వ తారీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు  వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు  ఏలూరు ఎమ్మెల్యేగా గురువారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ప్రచార బోర్డును చూపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆశీర్వదించాలని  వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెరికె వరప్రసాదరావు పిలుపునిచ్చారు. కరోనా సమయంలో  ఆళ్ల నాని  ఎన్నో కుటుంబాలకు సంబంధిత శాఖల అధికారులచే నిరంతర  సేవా కార్యక్రమాలు ముందుండి నడిపించారని, ప్రజలను కోవిడ్ భారీనా పడకుండా. ఎక్కువశాతం ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తం చేశారని గుర్తు చేశారు. నిస్వార్థ ప్రజా సేవకు, నీతి నిజాయితీకి మారుపేరుగా, మచ్చలేని నాయకునిగా నిలువుటద్దమని పేదల పాలిటి పెన్నిదని కొనియాడారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా అందించాలని ఓటర్లను అభ్యర్థించారు, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆకాంక్షించారు. ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నానిని, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ని పెద్ద ఎత్తున గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు గంటా ప్రసాద్, మాట్లాడుతూ  సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల నాని  బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయించారని సంతోషం వ్యక్తం చేశారు. బీసీ నాయకులు పివి రావు  మాట్లాడుతూ జనహృదయనేత ఆళ్ల నాని మరో మారు ఎమ్మెల్యేగా గెలిచి విజయ పదం వైపు దూసుకెళ్తారని తెలిపారు. సొంగ సందీప్ మాట్లాడుతూ ఎస్సీలకు మాల మాదిగ రెల్లి కులస్తులను కార్పొరేషన్ చైర్మన్ లను చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే నని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు మంగరాజు, ఏలూరు వైయస్ ఆర్ సి పి జిల్లా ప్రధాన కార్యదర్శి జ్ఞానరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author