PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి ..బిజెపి ..జనసేన.. కూటమికే మా మద్దతు..బలిజ సంఘీయులు

1 min read

డోన్ నియోజకవర్గం కాపు బలిజ సంఘీయుల మద్దతు టిడిపి బిజెపి జనసేన ఎంఎల్ఏ, ఎంపీ అభ్యర్థులకే… కొట్టె మల్లికార్జున

బిజెపి యువ నాయకులు …

మర్రి రమణ ఆధ్వర్యంలో డోన్ అసెంబ్లీలో బలిజలు ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా ఎంఎల్ఏ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి…

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాపు బలిజ సోదరీ, సోదరులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని వారి యొక్క అభివృద్ధికి దోహదపడే విధంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  కృషి చేసిన విషయం అందరికీ తెలిసిందే. డోన్ అసెంబ్లీ బిజెపి యువ నాయకులు మరియు కాపు సంక్షేమ సేన రాష్ట్ర నాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ 2014 సమైక్యాంధ్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు కాపు విద్యోన్నతి ,ఎన్టీఆర్ సివిల్స్ విద్యొన్నతి ద్వారా కాపు పేదవిద్యార్థులకు అండగా ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న కాపు విద్యార్థులు అందరికీ అండగా నిలిచారు.అలాగే కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తూ కాపు సంక్షేమం పేరిట సబ్సిడీ లోన్ లు ఇచ్చి  కాపు , బలిజ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంతోపాటు, కాపు భవన్ లను ఏర్పాటు చేసే దిశగా కాపులకు అన్ని విధాలుగా న్యాయం చేశారు. అదేవిధంగా కాపు బలిజల సామాజిక ,ఆర్థిక స్థితిగతులు తెలిసే విధంగా, వారికి రాజకీయంగా అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో మంజునాథ కమిషన్ ను ఏర్పాటు చేశారు. మంజునాథ కమిషన్ రిపోర్ట్ ప్రకారం కాపులకు బి సి ఎఫ్ కోటాలో కాపు బలిజలను  బీసీలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్రత్యేకత తరగతిలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా శాసనసభలో చట్టం చేసి కాపులకు అండగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ,  మా మిత్రపక్ష నాయకులు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్  పేర్కొన్నట్లు కోస్తాలో కాపులు,రాయలసీమలో బలిజలు యొక్క మద్దతు  చంద్రబాబుకు ఉంటుందని బిజెపి యువ నాయకులు, కాపు యువ నేత కొట్టె మల్లికార్జున మీడియా వేదికగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 103వ చట్టం ద్వారా అగ్రవర్ణ పేదలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్స్ లో కూడా కాపులకు ఐదు శాతం రాష్ట్రంలో వర్తింప చేస్తానని చెప్పినా చంద్రబాబుకు కాపు , బలిజలు మద్దతు ఉంటుంది. గతంలో కాపులకు సంక్షేమం పేరిట 1000 కోట్లు నిధులు విడుదల చేస్తాను కాపు భవన్లో ఏర్పాటు చేశాను అని చెప్పి,కాపు, బలిజల్ని  మోసం,దగా చేసినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ, రాచరిక, నియంతృత్వ పరిపాలనను కాపు బలిజ సోదరులందరం తిప్పికొడతాం. కాపుల సత్తా ఏంటో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి తెలియజేస్తాం. కోస్తాలో కాపులు, రాయలసీమలో బలిజల యొక్క మద్దతు టిడిపి బిజెపి జనసేన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకే ఉంటుందని మీడియా ముఖంగా పేర్కొంటున్నాను. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టిడిపి బిజెపి జనసేన త్రిముఖ కూటమిదే .ధర్మమే అంతిమంగా విజయం సాధిస్తుందని   పేర్కొన్నారు. ఈ బలిజ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా డోన్ ఎంఎల్ఏ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, అర్జా రామకృష్ణ, మర్రి గోవిందు రాజ్, పుల్లారెడ్డి, కునిశెట్టి రాయల్ మల్లికార్జున, లక్ష్మీకాంత్, డోన్ అసెంబ్లీ కాపు బలిజ నాయకులు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమావేశం అనంతరం మన భవిష్యత్ మన పవన్ కళ్యాణ్, మన బలిజలు మన సేన నూతన క్యాలెండరును బలిజ సంఘం నాయకులతో కలసి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది. బలిజ నాయకులు ప్రజలు అందరూ ఎంఎల్ఏ అభ్యర్థిగా నన్ను గెలిపించండి మీ అందరికీ అండగా ఉంటానని కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పేర్కొనడం జరిగింది.

About Author