లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయింపు…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలోని గీత కులాలకు రిజర్వ్ చేసిన పది (10) మద్యం షాపులను ఉపకులాల వారిగా యూనిట్ ( షాపులు ఏర్పాటు చేసే ప్రాంతం ) లను నేడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ బి. నవ్య గ ఈరోజు (24-1-25) ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో వీడియో కవరేజ్ చేసి లాటరీ ద్వారా గీత ఉపకులాలకి అనగా గౌడ్ లకు (3) కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్, కృష్ణగిరి మండలం, కౌతాళం మండలం..ఈడిగలకు ఆదోని మున్సిపాలిటీ, ఆదోని రూరల్ మండలం, మద్దికెర, కోసిగి, చిప్పగిరి..గౌడ లకి యెమ్మిగనూరు మున్సిపాలిటీ షాపులను కేటాయించినారు . ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మచ్చ సుధీర్ బాబు, ఇంచార్జ్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ చంద్రహస్, రాజేంద్ర ప్రసాద్ మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు .