మిడుతూరులో వీఆర్ఓ లకు స్థానాల కేటాయింపు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు):నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్ట మొదటిసారిగా అధికారుల సాధారణ బదిలీల్లో భాగంగా అన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు జరుగుతూనే ఉన్నాయ్..22 వ తేదీ రాత్రి గ్రామ రెవెన్యూ అధికారులకు స్థానాలు కేటాయిస్తూ నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.వీఆర్వోలకు కేటాయించిన స్థానాలు ఈ విధంగా ఉన్నాయి.నంద్యాల జిల్లా మిడుతూరు మండలం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిన వారు మరియు ఈ మండలానికి వచ్చిన వారి వివరాలు::చౌటుకూరు వీఆర్వో వై రామయ్య మిడుతూరు 2 కు బదిలీ,అలగనూరు విఆర్ఓ గడివేముల మండలం చెనకపల్లె గ్రామానికి బదిలీ. మాసపేట విఆర్ఓ రాఘవేంద్ర పగిడ్యాల మండలం టి ముచ్చుమర్రి గ్రామానికి.. మాసపేట గ్రామ విఆర్వో గా తలముడిపి వీఆర్వో సంజీవరాజు..పాములపాడు మండలం ఇస్కాల వీఆర్వో జి సుందరాజు నాగలూటి కి.. మల్యాల వీఆర్వో జి శ్రీనివాసులు అలగనూరు కు.. నాగలూటి విఆర్ఓ ఖాదర్ బాష తలముడిపి కి.. దేవనూరు వీఆర్వో సోఫీ సాహెబ్ చౌటుకూరు కు..తిమ్మాపురంలో పని చేస్తున్న కే రామకృష్ణను వీపనగండ్ల కు..మిడుతూరు 2 విఆర్వో పి ఆంజనేయులు గడివేముల మండలానికి.. గడివేముల మండలంలో పనిచేస్తున్న ఖాజా హుస్సేన్ దేవనూరు కు బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.మండలంలోని కడుమూరు,తిమ్మాపురం, జలకనూరు ఈ మూడు గ్రామాలకు ఎవరినీ నియమించలేదు.