చిన్నహ్యట శేషగిరికే మార్కెట్ యార్డ్ చైర్మన్ స్థానాన్ని కేటాయించాలి
1 min readహొళగుంద మండల కన్వీనర్ తుంబళం తిప్పయ్య
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ స్థానాన్ని ఎస్సీ రిజర్వుడు చేసినందుకుగానూ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి హొళగుంద మండల కన్వీనర్ తుంబళం తిప్పయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపుతూ, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని చిన్నహ్యట శేషగిరికే కేటాయించాలని డిమాండ్ చేశారు . తెలుగుదేశం పార్టీలో 1999వ సంవత్సరంలో క్రియాశీల సభ్యుడిగా చేరిన చిన్నహ్యట శేషగిరి పార్టీకి విశేష సేవలను అందిస్తూ అంచలంచలుగా దిగువ స్థాయి నుంచి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగారు. దానికి తోడుగా గత 26 సంవత్సరాలుగా ఆలూరు నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల విజయానికై విశిష్ట ప్రణాళికలను రచించి పార్టీ అభ్యర్థుల విజయానికి తనదైన శైలిలో పాటుపడ్డారన్నారు. తెలుగుదేశం పార్టీలో నిష్కల్మషుడు వివాదరహితుడిగా నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సుపరిచితుడైన విద్యావంతుడు అనుభవజ్ఞుడు రాజకీయ కోవిదుడైన చిన్నహ్యట శేషగిరి శాసనసభ ఎన్నికల్లో బనగానపల్లె మంత్రాలయం నియోజకవర్గపు ఎన్నికల సమన్వయకర్తగా కూడా తన సేవలనందించారు. శేషగిరి గతంలో ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు రాష్ట్ర దళిత నాయకులుగా ప్రఖ్యాతిగాంచి, దళిత బడుగు బలహీన వర్గాలతో పాటు సకల సమూహాలను సమిష్టిగా సమైక్యతతో ఏకం చేస్తూ, సర్వులకు సానుకూలమైన వ్యక్తిగా కార్య సాధకుడిగా ప్రజా పాలనలో తనదైన ముద్ర వేశారన్నారు. కాగా గతంలో ఆలూరు అసెంబ్లీ స్థానానికి ఎస్సీ రిజర్వుడు స్థానం కేటాయించగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మసాలా ఈరన్న విజయ దుందుభి మోగించి శాసనసభ సభ్యులుగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు ఎస్సీ రిజర్వేషన్ రాకపోగా, ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఎస్సీ సమూహాన్ని గుర్తిస్తూ ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ స్థానాన్ని ఎస్సిలకు రిజర్వ్ చేయడం హర్షించదగ్గ విషయం. అయితే ఇప్పటివరకు ఆలూరు నియోజకవర్గం లోని వివిధ మండలాల వారు మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా నియమించబడ్డారు. కానీ హొళగుంద మండలానికి ఆలూరు మార్కెట్ యార్డులో సముచిత స్థానం లభించకపోయినందున ఈసారి తప్పకుండా హొళగుంద మండలాన్ని గుర్తిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా మంచిపట్టున్న అపార అనుభవజ్ఞ దళిత నాయకులు మరియు టిడిపి సీనియర్ నాయకులైన చిన్నహ్యట శేషగిరికే తప్పకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని కేటాయిస్తేనే పార్టీ కోసం పాటుపడిన వారి సేవలకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు.ఈ సమావేశంలో కుడ్లూరు ఈరప్ప టిడిపి సీనియర్ నాయకులు తోక వెంకటేష్, టిడిపి యువ నాయకులు గిరి, ఖాదర్ బాషా, దిడ్డి సిద్ధప్ప, వలి భాష, ఐటిడిపి హనుమంతు, టిఎన్ఎస్ఎఫ్ మల్లీ, జమ్మయ్య, బంగారప్ప,గాదిలింగ,తదితరులు పాల్గొని చిన్నహ్యట శేషగిరి కే ఆలూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని కేటాయించి హొళగుంద మండలానికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని మరియు ఆలూరు నియోజకవర్గ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో బంగారప్ప, వలిభాష, గాది లింగ తదితరులు పాల్గొన్నారు,