ఎన్ ఎస్ ఎస్ ఆద్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ఎన్ ఎస్ ఎస్ ఆద్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల ను ప్యాపిలీ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఈసందర్భంగా గురువారం వారు మాట్లాడుతు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో,చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. చదువుకునే రోజుల్లోనే విద్యార్థులు దైర్య సాహసాలను పెంపొందించుకోవాలని విద్యార్థులు కు సూచించాడు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పిఓ నవిన్ పాటి, లెక్చరర్స్రామకృష్ణ య్య,నవిన్, ఓబులేసు,వెంకటరమణ, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, శంకరయ్య,ముస్తాక్, మరియు ఎన్ ఎస్ ఎస్ వాలేంటరిలు తదితరులు పాల్గొన్నారు.