చదువుతో పాటు..క్రీడలు అంతే ముఖ్యం:ఎస్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ అంతే ముఖ్యమనిబ్రాహ్మణకొట్కూరు ఎస్ఐ తిరుపాలు అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని వడ్డమాను జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు బుధవారం మధ్యాహ్నం ఎస్ఐ తిరుపాలు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించి తర్వాత జిల్లా స్థాయి బాలుర కబడ్డీ పోటీలకు ఎంపికైన పదో తరగతి విద్యార్థి ఎం.మధుసూదన్ ను ఎస్ఐ అభినందించారు.భవిష్యత్తులో రాష్ట్ర స్థాయికి కూడా ఎన్నిక కావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు చక్కని తర్ఫీదు ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ రాజేశ్వరి దేవిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జుబేదా బేగం,రఫీ,అహమ్మద్, ఈశ్వరయ్య,అల్లి హుస్సేన్, హబీబుల్లా,పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొని జిల్లా స్థాయికి ఎంపిక అయిన విద్యార్థిని అభినందించి భవిష్యత్తులో క్రీడల్లో మంచి ప్రతిభ కనబరుస్తూ పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అంతే కాకుండా ప్రతి విద్యార్థి బాల బాలికలు క్రీడలో ఉన్నత ప్రతిభను కనబరచాలని ఎస్సై విద్యార్థులకు తెలియజేశారు.