PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందికొట్కూర్ లో పూర్వపు విద్యార్థుల సమ్మేళనం

1 min read

పేద విద్యాభివృద్ధి కోసం గాంధీ మెమోరియల్ ట్రస్ట్

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కుటుంబ సభ్యులు బంధువుల కన్నా స్నేహం అనేది చాలా గొప్పదని 1970 సం.నుండి చదివిన ఆనాటి పూర్వ విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ పూర్వపు విద్యార్థులు అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ద్వారా వారు చదువుకునే సమయంలో వారి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు పూర్వపు విద్యార్థులు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని గాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన వారు ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నామని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు పలు విషయాలను ఇతరులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు అల్వాల సురేషయ్య మాట్లాడుతూ ఎంతోమంది పేద విద్యార్థులు ఆర్థిక పరంగా ఉన్నత చదువులు చదవలేక పోతున్నారని వీరిని దృష్టిలో పెట్టుకొని మేమంతా కలిసి గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉన్నత చదువుల కొరకు ఆర్థికంగా ఆదుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరామ థియేటర్ అధినేత రామిరెడ్డి మాట్లాడుతూ గత చాలా సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఇలాగే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని ఇంకా 1984 -2024 వరకు ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులను కూడా వచ్చే సంవత్సరం నుండి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ట్రస్ట్ కు పూర్వ విద్యార్థులు 2 లక్షల 10 వేల రూపాయలను పూర్వపు విద్యార్థులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కట్టమంచి జనార్దన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డి,సత్యం, లక్ష్మీనారాయణ,సోలమన్ రాజు,శ్రీకాంత్ గౌడ్,శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

About Author