కార్యకర్తను పరామర్శించిన ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోలగుంద మండలం కోగిలతోట గ్రామం వైసీపీ కార్యకర్త బోయ దేవన్న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విరుపాక్షి గురువారం ఆసుపత్రికి వెళ్లి దేవన్నను పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని దేవన్నకు ఎమ్మెల్యే విరుపాక్షి భరోసానిచ్చారు.