PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంబేద్కర్ ఫ్లెక్సీ ని చింపిన ఉండి ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్  నందికొట్కూరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీ ని చింపిన ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పై కఠిన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం శాసనకోట గ్రామ సర్పంచ్ జనార్ధన్ గౌడ్ గురువారం పాత్రికేయులతో అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని అంబేద్కర్ చేసిన కృషి ఫలితంగానే నేడు అధికారులు ప్రజా ప్రతినిధులుగా అవుతూ ఉన్నామని ఆయన అన్నారు.ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పై వెంటనే కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయాలని అంతేకాకుండా ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సర్పంచ్ డిమాండ్ చేశారు.

About Author