ప్రైడ్ ఆఫ్ భారత్ అవార్డు గ్రహీత గా అమీన్ భాయ్
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: న్యూఢిల్లీ కి చెందిన వరల్డ్ సెవెన్ వండర్ రేడియంట్ టాలెంట్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు ప్రతి సంవత్సరం దేశ సేవ మరియు సమాజ సేవ చేసే భారతీయులని గుర్తించి ప్రైడ్ ఆఫ్ భారత్ అవార్డు ద్వారా సత్కరిస్తారు.గత కొన్ని సంవత్సరాలుగా అమీన్ భాయ్ సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఆయన సేవలను గుర్తించి నేడు ప్రైడ్ ఆఫ్ భారత్ అవార్డు గ్రహీతగా ఎన్నిక చేశారు.ఈ సందర్భంగా హైదరాబాద్ లోతెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు మరియు చైర్మన్ డాక్టర్ ప్రతాని రామ కృష్ణ గౌడ్ అమీన్ భాయ్ కు శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా ప్రముఖ హీరోయిన్ లోరా, డాన్స్ మాస్టర్ సిరాజ్ పాల్గొని అభినందనలు తెలిపారు.అనంతరం రామ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ నేటి సమాజంలో అమీన్ భాయ్ లా సేవా కార్యక్రమాలు చేసే వారు చాలా అరుదుగా ఉంటారని, మంచి సమాజం కోసం కృషి చేసిన వ్యక్తి, A1 ఫౌండేషన్ సేవలను కొనియాడారు.ఈ అవార్డు నా చేతుల మీదుగా అందించడం ఆనందంగా ఉంది అన్నారు.మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.అమీన్ భాయ్ మాట్లాడుతూ నేటి సమాజంలో యువత ఆలోచన సరిగా లేకపోవడంతో దేశంలో నేటికి కొందరు నాకూ లాభం ఏమిటి అనే ధోరణిలో ఉన్నారన్నారు.దేశం మరియు సమాజం మాకు ఏమీ ఇచ్చారు అని ప్రశ్నిస్తున్నారన్నారు.కాని మీరు దేశానికి మరియు సమాజానికి ఏమీ చేశారు ఒక్కసారి ఆలోచన చేయండని,కేవలం సేవా కార్యక్రమాలతో ఐన మీ కర్తవ్యం నిర్వహించడానికి ఏర్పాట్లు మేము చేస్తామన్నారు.మా A1 ఫౌండేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉచిత సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు.సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు అండగా నిలబడి ఉండాలన్నారు.ఇందుకోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు, యువత సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.సమాజానికి మరియు దేశానికి సేవ చేయడం ఉత్తమ భారతీయుల లక్షణాలన్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ట గ్రాం,యుటుబ్ ద్వారా మీ విలువైన సమయాన్ని, యవ్వనమ, డబ్బులు వృథా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు.ప్రతి ఒక్కరూ సమాజా సేవకు ఒక బాధ్యతగా తీసుకుని స్వచ్ఛందంగా ముందుగా రావాలని పిలుపునిచ్చారు.