మనవంటగది, మన బాధ్యత పై మహిళలకు అవగాహన కార్యక్రమం
1 min readగ్యాస్ స్టవ్ వద్ద వంట చేసేటప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాలి
డిప్యూటీ తాసిల్దార్ గాయత్రి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఇంట్లో వంట పూర్తి అవ్వగానే చాలామంది స్టవ్ దగ్గర ఆఫ్ చేస్తుంటారు కానీ రెగ్యులేటర్ దగ్గర కూడా ఆఫ్ చేయాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న మన వంటగది-మన బాధ్యత అనే కార్యక్రమo అభినందనీయమని, స్వాగతిస్తున్నట్లు ఏలూరు డిప్యూటీ తహసిల్దార్ గాయత్రి అన్నారు. భారత ప్రభుత్వ పెట్రోలియం మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు జిల్లా సేల్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఆదివారం ఉదయం జిల్లా కలెక్టరేట్ ప్రాంతంలో మనవంటగది -మన బాధ్యతఅనే ప్రోగ్రాం జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిప్యూటీ తహసిల్దార్ గాయత్రి మాట్లాడుతూ పిల్లలను స్కూల్ కి రెడీ చేస్తూ వంట చేసే క్రమంలో, అదేవిధంగా ఆఫీస్ కి త్వరగా వెళ్లాలని వెళ్లే క్రమంలో కంగరుగా చాలా సందర్భాల్లో రెగ్యులేటర్ దగ్గర ఆఫ్ చేయకుండా ఉంటాము. వంట గదిలో స్టవ్ మీద పాలు లేదా టీ పెట్టి, టీవీ ముందు కూర్చోవడం చాలా మంది చేస్తుంటారు. కానీ గ్యాస్ నీ దృష్టిలో పెట్టుకుని మెలకువగా అప్రమత్తంగా ఉండాలని అంతా పూర్తి అవగానే గదిని శుభ్రపరచుకోవాలని ఇంకా అనేక సేఫ్టీ సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ సేల్స్ ఆఫీసర్ మహేష్ కుమార్, ఏలూరు కు చెందిన గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, ఆఫీస్ స్టాప్, డెవరి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వంటలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు, ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా గ్యాస్ట్రవులు, లెటర్ లను డిప్యూటీ ఎమ్మార్వో చేతుల మీదుగా అందజేశారు.