లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు సామాజిక సేవ రంగంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అల్ బసామ్ యూనివర్సిటీ ఆఫ్ కల్చర్, ఆర్ట్స్ ,అండ్ సైన్సెస్ బెత్లెహెమ్, పాలస్తీనా నుంచి నేడు అంతర్జాలంలో జరిగిన సమావేశంలో గత 34 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు అందిస్తున్న నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు సామాజిక సేవా రంగంలో గౌరవ డాక్టరేట్ ను బాసమ్ ఫోరం ఫర్ కల్చర్ అండ్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు హెడ్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ బసామ్ జబ్లా, డాక్టర్ షాకిరత్ అల్ మహాబీర్ లు అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక సేవారంగంలో గౌరవ డాక్టరేట్ గ్రహీత లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలన్నారు.