“జైలు లో కుల ఆధారిత వివక్ష పై తనిఖీ:”
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బి. లీలా వెంకట శేషాద్రి,సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్నూల్ వారు కర్నూల్ పురుషుల కేంద్ర కారాగారము మరియు మహిళ కారాగారామును విజిట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా “జైలు లలో కుల ఆధారిత వివక్ష మరియు ఇతర రకములైన వివక్షలు జరుగుతున్నాయో లేదో గుర్తించడానికి తనిఖీ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జైలు లలో కుల ఆధారిత వివక్ష గురించి ఖైదీలతో మాట్లాడడం జరిగినది, కులమత బేధాలు లేకుండా సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేయాలని కోరారు.ఖైధి లకు ఎవరికైనా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. ఖైధి లకు అందించే ఆహారాన్ని, వారి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. ఖైధి లను కోర్ట్ వాయిదా లకు కచ్చితంగా హాజరు చెయ్యాలని ఆదేశించారు.ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూలు వారిని సంప్రదించవచ్చును అన్నారు, లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జైలు సందర్శన లాయర్ వెంకటేశ్వర్లు,కేంద్ర కారాగారము సూపరిండెంట్ చంద్రశేఖర్ మరియు ఖైదీలు పాల్గొన్నారు.