రేషన్ మాఫియా పై ఉక్కు పాదం మోపాలి
1 min readరాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ డైరెక్టర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో జరుగుతున్న రేషన్ మాఫియా ఆగడాలపై మరియు పేదలకు అందించే రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న విషయమై రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ డైరెక్టర్ కొంకతి లక్ష్మీనారాయణ కర్నూలు జిల్లా డిఎస్ఓ తో మరియు కర్నూలు జిల్లా సివిల్ సప్లై కార్పోరేషన్ మేనేజర్ తో కలిసి చర్చించడం జరిగింది రేషన్ మాఫియా పై ఉక్కు పాదం మోపాలని ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఈ మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కాబట్టి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని కోరారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించిన వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది.