PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ ఎన్ ఎస్ ఆర్ కాలేజీ  పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  వెలుగోడు  ఎస్ ఎన్ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల 1987-90 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నాడు వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు విద్యార్థులు మాట్లాడుతూ  వెలువడు ఎస్ ఎం ఎస్ ఆర్ కళాశాల అధ్యాపకులు నేర్పిన విద్య తో ఉన్నత శిఖరాలకు చేరమన్నారు.విద్యార్థులు తమకు బోధించిన అధ్యాపకులను ప్రొఫెసర్ రత్నస్వామి ని సమావేశానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. పూర్వపు విద్యార్థులు నాగేశ్వరావు డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా పని చేస్తుండగా, రాజకుమార్ ప్రభుత్వ పాలిటెక్నిక్ లో సీనియర్ అధ్యాపకులు గాను, రామకృష్ణ, మగ్బుల్ బాషా, వెంకటేశ్వర్లు తదితరులు ఉపాధ్యాయులు గాను పని చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల కలయికకు స్థానిక విద్యార్థి చంద్రమోహన్ కీలక పాత్ర పోషించారు.కార్యక్రమం లో పూర్వపు ప్రిన్సిపాల్ డాక్టర్ రాంభూపాల్ రెడ్డి, విశ్రాంత అధ్యాపకులు జనార్దన్ రెడ్డి, శ్యామప్రసాద్ శర్మ, నారాయణ రెడ్డి, దొరస్వామి తోటి మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

About Author