వైసిపి హయాంలోనే రాష్ట్రంలో అరాచక పాలన..
1 min readటిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి లాయర్ బాబు.
పల్లెవెలుగు వెబ పాణ్యం: రాష్ట్రంలో వైసిపి ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతాము అనడం సిగ్గుచేటు అని శనివారం నాడు పాణ్యం కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు అన్నారు. రాష్ట్రంలో వైసిపి ఐదు సంవత్సరాల పరిపాలనలో హత్యలు రౌడీయిజము భూకబ్జాలు జీవో నెంబర్ వన్ టైటిల్ ల్యాండ్ యాక్ట్ సాండ్ వైన్ మైనింగ్ గంజాయి మాఫియా తో రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగించారన్నారు. రాష్ట్ర ప్రజలు వైసిపి ప్రభుత్వంతో విసుకు చెంది రాష్ట్రంలో ప్రజలు తెదేపా జనసేన బిజెపి కూటమికి అఖండ విజయం చేకూర్చారన్నారు ప్రజలు వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు .రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వల్ల రాష్ట్ర ప్రజలు ఏమి కోల్పోయారు అనే విషయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలుసు అన్నారు తుగ్లక్ పరిపాలన వలన రాష్ట్రం ఇప్పటికే 30 సంవత్సరాలు వెనకబడిపోయింది అన్నారు రాష్ట్రంలో ఎంతోమంది కార్మికులు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు రాష్ట్రాన్నివిడిచి పక్క రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస పోయారన్నారు నిరుద్యోగులు ఉద్యోగం లేక కూలి పని వెళ్లి జీవనం కొనసాగించారన్నారు అన్న క్యాంటీన్ లేక పేదలు రోడ్ల ప్రక్కన గుడిసెలు వేసుకున్న అనాధలు ఆకలితో కడుపు కాల్చుకున్నారన్నారు వైసిపి పార్టీని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పరిపాలనలో జరిగిన అరాచకాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు.