హిందువుల ప్రాచీన ఆలయాలను పునరుద్ధరించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రాచీన ఆలయాలను పునరుద్ధరించటం ఈనాటి అవసరమని కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బీ దస్తగిరి గారు అన్నారు. కర్నూల్ శ్రీ రామాలయం శతాబ్ది బ్రహ్మోత్సవాల లో భాగంగాఈనెల 10వతేది ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణం మరియు ఊంజల సేవలో శ్రీ దస్తగిరి ముఖ్య అతిథిగా పాల్గొని పలు విషయాలను తెలియజేశారు .కర్నూలు నగరంలో ప్రాచీన రామాలయాలలో ఒకటి పేట రామాలయం ,రెండవది రాంబోట్ల దేవాలయం .ఈ రెండు ఆలయాలను పునరుద్ధరించటం కర్నూలు నగరవాసులకు చాలా అవసరమని కూడా శ్రీ దస్తగిరి తెలియజేశారు.భగవంతుడైన శ్రీరామచంద్రుడు , సీతమ్మవారు ఇద్దరూ శుక్ల నవమి తిథి నాడే జన్మించారని , ఆ సందర్భంగా ఇద్దరికీ ఊంజల సేవ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇది ప్రతి నెల నిర్వహిస్తామని, కర్నూలు రామాలయం అర్చకులు శ్రీ మాళిగి హనుమేష్ ఆచార్యులు తెలియజేశారు. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పునర్ వైభవంగా ఆలయాన్ని తీర్చిదిద్దే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని కూడా తెలియజేశారు. శతాబ్ది బ్రహ్మోత్సవాల్లో భాగంగా పురస్కరించుకొని ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీ చిలుకూరు ప్రభాకర్ పలు కార్యక్రమాలను తెలియజేశారు .అఖిలభారత కరివేన నిత్యాన్నదాన సత్రం నిర్వాహకులుడా.వేణుగోపాల్ భక్తులందరికీ అన్నదాన ప్రసాద సేవ చేస్తూ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కట్టా రాఘవేంద్ర ప్రసాద్,శ్రీ ఏల్కూరు ద్వారకనాథ్ ,డా.రంగయ్య, విట్టల్ శెట్టి, శ్రీ వేదవ్యాస మూర్తి,శ్రీ మాళిగి సత్య , శ్రీ దినేష్ , శ్రీ శ్యాం , శ్రీసతీష్ తదితరులు పాల్గొన్నారు.