నేటి యువతకు ఆదర్శం ఆంధ్ర కేసరి
1 min readప్రధానోపధ్యాయురాలు.భ్రమరాంభ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నేటి యువతకు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శం కావాలని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంభ ఆకాంక్షించారు. శుక్రవారం పతికొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపధ్యాయురాలు భ్రమరాంబ ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 152 వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.మొదట ఆంధ్ర కేసరి చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హెడ్మాస్టర్ భ్రమరాంబ మాట్లాడుతూ, ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గా పనిచేసారని తెలిపారు.ఈయన నీతికి నిజాయితీకి నిలువుటద్దం అని అన్నారు.తను ఆదర్శ వంతమైన జీవితాన్ని గడిపారని, ఆయన బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ధీటుగా ఉద్యమం నడిపారని అన్నారు.నేటి యువతకు ఆయనను ఆదర్శంగా ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా నేటి రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొత్తపల్లి సత్యనారాయణ మరియు ఉపాధ్యాయుని, విద్యార్థినిలు పాల్గొన్నారు.