PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం మనందరికీ ఆదర్శం..

1 min read

ప్రధానోపాధ్యాయుడు ఎం రామేశ్వరరావు.

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు  జయంతిని శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామేశ్వరరావు  మాట్లాడుతూ “టంగుటూరి ప్రకాశం పంతులుగారు” ఒక భారతీయ న్యాయ నిపుణుడు,  రాజకీయ నాయకుడు, సంఘసంస్కర్త మరియు వలసవాద వ్యతిరేక జాతీయ వాది, మద్రాసు ప్రెసిడెన్సికి ప్రధానమంత్రిగా పనిచేశారని, భాషా పరంగా మద్రాస్ రాష్ట్ర విభజన ద్వారా ఏర్పడిన పూర్వ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రకాశంని ఆంధ్రకేసరి అని పిలిచేవారని. ఆంధ్ర కేసరి అనగా ఆంధ్ర సింహం అని అర్థం. ప్రకాశం పేరు మీద చాలా ఉన్నతమైన సంస్థలు ఉన్నతమైన ప్రదేశాలు ఉన్నాయన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు కష్టపడిన విధానము కష్టపడి ఉన్నత స్థాయికి ఎలా ఎదిగారో వివరించారు. ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఎం. రామేశ్వర రావు , పాఠశాల ఏ.వో. శ్రీ ఎం.బి.ఎన్. రాఘవేంద్ర రావు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేశారు.

About Author