PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఆంధ్రకేసరి  టంగుటూరి ప్రకాశంపంతులు జన్మదిన వేడుకలు

1 min read

జిల్లా ఎస్పీ  అధిరాజ్ సింగ్ రాణా

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేశరి కీ॥శే॥లు టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతిని పురస్కరించుకుని నంద్యాల జిల్లాపోలీసు కార్యాలయంలో జయంతి వేడుకులకు జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా IPS  ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ  కీ॥శే॥లు టంగుటూరి ప్రకాశం పంతులు  చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, దేశభక్తుడు, మేధావి, ప్రజాసేవకుడు, ధీరుడు, కార్యదక్షుడని 1953 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేశారని తెలియజేశారు.స్వాతంత్ర్య ఉద్యమంలో సైమన్ కమీషను భారతీయులపై కాల్పులు జరపగా, మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెచూపి ’కాల్చ’ మని ధైర్యంగా  నిల్చి తెల్లదొరలను హడలెత్తించి “ఆంధ్రకేసరి” అని పేరు పొందిన మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు. నేడు వారి “జయంతి” సందర్భంగా ఆ మహావీరుడి కి నమస్సుమాంజలు అర్పించుకుందామన్నారు.కీ॥శే॥లు ప్రకాశం పంతులు  స్వాతంత్ర్య సమరయోధునిగా, న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, రచయితగా, సంపాదకీయునిగా, రాజనీతిజ్ఞునిగా విశేషంగా రాణించి ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని తీసుకువచ్చారన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు  అందించిన సేవలుకు గుర్తుగా ఆయన స్వంత జిల్లా ఒంగోలును 1972లో ఆయన పేరుతో ‘ప్రకాశం’గా నామకరణం చేసారన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ప్రకాశం పంతులు , ఎంతో కష్టపడి, వారాల అబ్బాయిగా ఉన్నత చదువులు చదివి, స్వశక్తితో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారని జిల్లా ఎస్పీ  తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ K.ప్రవీణ్ కుమార్  అర్ముడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ,AAO నిజాముద్దీన్ , supdt కవిత,ఖాదర్ వలీ , ఎస్పీ CC నాగరాజు  జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, పోలీసు ,స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

About Author