PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్​ వాడి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా…

1 min read

టిడిపి మైనార్టీ రాష్ట్ర నాయకులు అన్సర్ భాష

చాగలమర్రి, పల్లెవెలుగు:అంగన్వాడి సమస్యలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు మాజీ సర్పంచ్ అన్సర్ భాష అన్నారు. శుక్రవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి ఏఐటీయూసీ యూనియన్ . అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అంగన్వాడి కార్యకర్తలు టిడిపి రాష్ట్ర మైనార్టీ నాయకులు అన్సర్ భాషను కలిసి పూలమాలలతో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా వారు గత ప్రభుత్వంలో అంగన్వాడి లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ 42 రోజులపాటు దీక్షలు చేపట్టిన ఫలితం శూన్యం అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా ఎన్నికలకు ముందు అంగన్వాడి సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. అనంతరం అన్సర్ భాష మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి తీసుకువెళ్లి అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన కోర్కెలను తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ, యూనియన్ సభ్యులు వహీదా హసీనా సుజాత ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.

About Author