PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి బాట కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని గడివేముల, చిందుకూరు గ్రామలలో ఐసిడిఎస్ సూపర్వైజర్ కళావతి, జయలక్ష్మి  ఆధ్వర్యంలో అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని అంగన్వాడి కార్యకర్తలు రాములమ్మ, రామ చెన్నమ్మ, కుమారి కి చెందిన అంగన్వాడి సెంటర్లలో శుక్రవారం నాడు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్లు కళావతి, జయలక్ష్మి మాట్లాడుతూ3నుంచి 5సంవత్సరాలపిల్లలందరిని అంగన్వాడీ కేంద్రం లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.అంగన్వాడీ కేంద్రాలలో ఆట, పాట మాట, కథ, సృజనాత్మ కత, సంసిద్దతతో కూడిన  పూర్వప్రాథమిక విద్య కార్యక్రమం లు నిర్వహించి పిల్లలకు శారీరక, మానసిక అభివృద్రికిఎంతో దోహద పడతాయాని  తల్లిదండ్రులకు తెలియజేశారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు,గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి కార్యకర్తలు, ఆయాలు చిన్నారులు పాల్గొన్నారు.

About Author