PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ పనితీరు కనపరిచిన అంగన్వాడీ కార్యకర్త

1 min read

శిశు సంక్షేమ శాఖ పరిధిలో సెంటర్ అడ్మినిస్ట్రేటర్ చుక్కా నిర్మలకి అవార్డు

మిషన్ శక్తి పథకం నుండి ఢిల్లీ ఎర్రకోటలో అవార్డు,సర్టిఫికెట్ ప్రధానం

అభినందించిన జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి,ఐసిడిఎస్ పిడి పి.పద్మావతి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : డైరెక్టర్, మహిళాభివృది మరియు శిశు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,గుంటూరు వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలను అనుసరించి, మహిళాభివృది మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలలో పనిచేయుచు ఉత్తమ పనితీరును కనపరిచిన వారిలో మిషన్ శక్తి పధకంలో నుండి ఒకరు ఏలూరు జిల్లా నుండి వన్ స్టాప్ సెంటర్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్  కుమారి చుక్కా నిర్మల, మరియు యితర జిల్లా లోని నలుగురు  అంగన్వాడి కార్యకర్త లను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తరపున న్యూ డిల్లీ కి ప్రత్యేక అతిధులుగా పంపుటకు ఎంపిక చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి   మహిళాభివృది మరియు శిశు సంక్షేమ శాఖ, ఏలూరు జిల్లా నుండి వన్ స్టాప్ సెంటర్, సెంట్రల్  అడ్మినిస్ట్రేటర్ కుమారి చుక్కా నిర్మల వెళ్ళి ఎర్ర కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక మెమేంటో, సర్టిఫికేట్ అందించడం జరిగింది. వాటిని తీసుకొచ్చి  జిల్లా కలెక్టర్ వారికి చూపించటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  కె.వెట్రి సెల్వి వారు కుమారి చుక్కా నిర్మల ను ఉత్తమ పనితీరును కనపరిచినందుకు అభినందించడం జరిగింది. అలాగే జాయింట్ కలెక్టర్  పి. ధాత్రి రెడ్డి ,జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి  పి.పద్మావతి  ఇతర జిల్లా అధికారులు ఆమె ను అభినందించడం జరిగింది.

About Author