PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంజనేయుడికి..ప్రత్యేక పూజలు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం హనుమత్ జయంతి సందర్భంగా    కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.  వేద పండితులు స్వామి వారికి విశేష అభిషేకం , ఆకు పూజలు, వడమాల సేవ మన్యుసూక్త హోమం, అరటిపళ్ళతో అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ధర్మపత్నితో కలిసి ఆంజనేయ స్వామికి ఆకు పూజ, అభిషేకము, వడమాల సమర్పించుకున్నారు. భక్తులు హనుమాన్ జయంతిలో పాల్గొని కార్యసిద్ధి ఆంజనేయ స్వామి కృపకు పాత్రులు అయ్యారు. అనంతరం భక్తులకు కాటసాని రాంభూపాల్ రెడ్డి వారి ధర్మపత్ని భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

About Author