PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంజనేయ స్వామి గుడి దారి మరమ్మతు

1 min read

పల్లెవెలుగు వెబ్  శ్రీరంగాపురం: శ్రీరంగాపూర్ మండల పరిధిలోని కంబాలాపురం గ్రామంలో ఆంజనేయస్వామి గుడికి దారి మరమ్మత్తులు చేయించవలసిందిగా కంబాలాపురం గ్రామ రైతులు మరియు పెద్దలు శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో… వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ తూడి మేఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే తక్షణమే స్పందించి అట్టి రోడ్డు మరమ్మత్తులకు మట్టిని కొట్టి ఆ యొక్క రోడ్డును పునర్నిర్మాంచాల్సిందిగా వారు కంబాలాపురం గ్రామ కన్వీనర్ మల్లేష్ ని ఆదేశించడం జరిగింది.అందుకుగాను… ఈరోజు కంబాలాపురం గ్రామంలో రోడ్ నుంచి పాతూరి ఆంజనేయ స్వామి గుడి వరకు  మండల కాంగ్రెస్ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి…మట్టిరోడ్డు మర్మత్తు పనులు ప్రారంభించడం జరిగింది.ఇందుకు సహకరించిన వనపర్తి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ తూడి మేఘా రెడ్డి కంబాలాపురం గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఈరపాగ కురుమన్న,  మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి జె ఆశన్న,కంబాలాపురం గ్రామ కాంగ్రెస్ కన్వీనర్ డి మల్లేష్, జానంపేట కాంగ్రెస్ నాయకులు నరేష్ కుమార్ రెడ్డి, కంబలాపురం  మాజీ సర్పంచ్ నాగయ్య, బోయ కృష్ణయ్య, బోయ కొండయ్య,కూతల లక్ష్మయ్య, గంగాధర్, తెలుగు రాజు, నగేష్,మౌలాలి, భరత్, తెలుగు రాజు, తదితరులు పాల్గొన్నారు.

About Author