శ్రావణమాసం లో… ఆంజనేయ స్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: శ్రావణమాసం రెండవ శనివారం కావడంతో చెన్నూరు మండలంలో ప్రధాన ఆంజనేయ స్వామి ఆలయాలు ఉదయం ఆరు గంటల నుంచి భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. చెన్నూరు బ్రాహ్మణ వీధిలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు అలంకరణ నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చెన్నూరు మండలం బుడ్డాయిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి రోడ్డు పక్కన వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు సంకీర్తన నిర్వహించారు. చిన్న మాసపల్లి జాతీయ రహదారి ప్రక్కన వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతం నిండిపోయింది. చెన్నూరు మండలం రామనపల్లి గ్రామంలో శివాలయం కు ఎదురుగా వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త చింతకుంట వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆంజనేయ స్వామిని దర్శించుకునే భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్తల సభ్యులు, గ్రామ పెద్దల సహకారంతో అన్న ప్రసాద వితరణ జరిగింది. చెన్నూరు పెన్నా నది అవతలి ఒడ్డున ఆంజనేయ పురం గ్రామంలో వెలసిన పెన్నా ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. కాజీపేట చెన్నూరు మండలాల వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి దర్శనానికి అనుమతించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చెన్నూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి( కోట్ల స్వామి) ఆలయంలో కలిసిన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలలో విద్యుత్ దీపాలతో అలంకరించి ఆలయాలు ఎదుట సల్వా పందిర్లు ఏర్పాటు చేశారు. ఆలయాల్లో ఉదయం నుంచి అరే రామ సంకీర్తన భజనలు నిర్వహిస్తున్నారు.