PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి పేద ముస్లింలకు సహాయం అందించే సంస్థ అంజుమాన్ సంస్థ

1 min read

ఏలూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్స్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు

ఆదివారం సున్తీ ల కార్యక్రమం విజయవంతం

ఈ ఏడాది 350 మంది పేద వర్గాలకు చెందిన 350 మంది.కి సున్తీ కార్యక్రమాలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : నిరాశ్రయులైన సహాయం కోరి వచ్చే ప్రతి ఒక్కరికి సహాయం అందించే సంస్థ అంజుమన్ సంస్థ అని ఏలూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు అన్నారు. పేద ముస్లింలు మరియు ఇతర అన్ని వర్గాల పేద ప్రజల పిల్లలకు అంజుమన్ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించే (సున్తీ) కార్యక్రమం స్థానిక అంజుమన్ హాల్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాఎస్ ఎమ్ ఆర్ పెదబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ముస్లిం ప్రజలకు సహాయం చేయడం కోసం ఏర్పడిన సంస్థ అంజుమన్ అన్నారు. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించిన పేద ముస్లిం పిల్లలకు ఈ సంవత్సరం సుమారు 350 మంది వరకు సున్తీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సున్తీ చేయించుకున్న పిల్లలకు రొట్టి పాలు తో పాటు మూడు రోజులకు సరిపడా మందులు వారి తల్లిదండ్రులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 12 సంవత్సరాలుగా అంజుమన్ సంస్థ ద్వారా పెద ముస్లింలకు విద్యా,వైద్యం,వివాహం,మట్టి ఖర్చులకు ఎందరికో సహాయం అందించారన్నారు.అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ సులేమాన్,సెక్రటరీ,సభ్యులు అందరూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలన్నీ విజయవంతంగ చేయగలుగుతున్నారు అన్నారు. ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న సభ్యులందరికీ అల్లా అనుగ్రహం ఉండాలని ఎస్ఎమ్ఆర్ పెదబాబు అన్నారు. ప్రెసిడెంట్ సులేమాన్ మాట్లాడుతూ కొత్త కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కర్బల మైదానంలో రంజాన్ పండుగ కార్యక్రమాలు మరియు ఈ రోజు నిర్వహిస్తున్న  సున్తీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీజాని,ఇగ్బాల్, వలి,అస్లాం,జహుల్,సిరాజ్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

About Author