PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో మహా అన్న సమారాధన

1 min read

అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న వేలాదిమంది భక్తులు

వివిధ మేళ తాళాల నడుము ఊరేగింపు..

కార్యనిర్వాహణాధికారి ఆకుల కొండలరావు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలం, మరియు పట్టణంలో వేంచేసియున్న శ్రీ సీతారామ  స్వామి వారి దేవస్థానం నందు ది.16.04.2024 వ తేదీన ప్రారంభమయిన బ్రహ్మోత్సవములలో భాగంగా ఈ రోజు అనగా ది.19.04.2024 వ తేదీ ఉదయం గం.10.30ని.ల నుండి మహా అన్నసమారాధన కార్యక్రమం జరూపబడినది. ఈ అన్నసమారాదన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ అన్నసమారాధన అనంతరం సాయత్రo గం.05.00 ల నుండి ప్రత్యేక వాహనం పై శ్రీ స్వామి వార్లను అమ్మవార్లను ఆసీనులు చేసి కేరళ నృత్యం, ఇతర నృత్య కార్యక్రమములతో వివిధ మేలా తాళాల నడుమ ఊరేగింపు ప్రారంభమగునని ఈ కార్యక్రమంలు ఆలయ అర్చకులు సిబ్బంది సమిష్టిగా వారిచే నిర్వహించబడుచున్నవని  ఆలయ కార్యనిర్వ హణాధికారి ఆకుల కొండలరావు తెలియజేసినారు.

About Author