ఘనంగా ‘‘యుపిఎస్ఎఫ్’’ వార్షికోత్సవం..
1 min readపల్లెవెలుగు కల్లూరు అర్బన్ : UPSF(Unaided private schools federation) 4 వ వార్షికోత్సవం నవంబర్ నెల 9, 10 తేదిలలో వైజాగ్ లో జరిగిన సందర్బంగా ప్రైవేట్ పాఠశాల లోని ఉత్తమ ఉపాద్యాయులను సన్మానించడం జరిగిది. దానికి కొనసాగింపుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాల లోని ఉత్తమ ఉపాద్యాయులను St. Lourds High school లో మీటింగ్ జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశమునకు ముఖ్య అతిథులుగా రాజు, అధ్యక్షులు వేల్పుల సుదర్శన్ గౌరవ అతిథులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీలను జిల్లా వ్యాప్తంగా ఎన్నుకోవడం జరిగింది. క్రొత్తగా ఎన్నికైన వారి వివరాలు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ ఎన్ క్రిస్టోఫర్, కర్నూలు మరియు నంద్యాల జిల్లా కన్వీనర్ సి కుమార్, జిల్లా అధ్యక్షులు ఎం రాఘవేంద్ర రాజు, జిల్లా కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, జిల్లా ట్రెజరర్ కె. శ్రీనివాసులు, జిల్లా జాయింట్ సెక్రటరీ ఎం వెంకటేశ్వర్లు, సిటీ కమిటీలో సిటీ జిల్లా అధ్యక్షులు టీ నాగన్న, సిటీ జాయింట్ సెక్రటరీ పి ఎలిపా బాబు, ట్రెజరర్ నాగరాజు అందరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని తెలిపారు . ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం లు, టీచర్స్ , కరస్పాండెంట్స్ పాల్గొనడం జరిగింది.