PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా వ్యాప్తంగా యాంటీ డ్రగ్స్ డే ర్యాలీలు, అవగాహన సదస్సులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్  ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచిస్తూ కళాశాలలు/పాఠశాలల విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు.ఈ ర్యాలీలో  కర్నూలు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు,   సెబ్ సూపరింటెండ్ రవి కుమార్ , ఎక్సైజ్ సూపరింటెండ్ సుధీర్ బాబు, కర్నూలు డిఎస్పీ విజయ శేఖర్ ,  సెబ్ అసిస్టెంట్ సూపరింటెండ్  వినోద్ కుమార్,  ట్రాఫిక్ సిఐ గౌతమి, కర్నూలు ఒకటవ పట్టణ సిఐ పవన్ కుమార్, కర్నూలు తాలుకా సిఐ శ్రీధర్ ,  సెబ్ సిఐ రాజేంద్ర ప్రసాద్,  డిటిఎఫ్ సిఐ నరసనాయుడు పాల్గొన్నారు. ఈ ర్యాలీ కర్నూలు కంట్రోల్ రూమ్ – ఎగ్జిబిషన్  గ్రౌండ్ నుండి ప్రారంభమై  కర్నూలు సెబ్ స్టేషన్ – ఓల్డ్ కంట్రోల్  మీదుగా  కర్నూలులోని పలు పాఠశాల విద్యార్దులతో కలిసి ర్యాలీగా  కర్నూలు కొండారెడ్డి బురుజు వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అక్కడ అందరూ   మానవహారం  ఏర్పాటు చేసి  విద్యార్దులు, పౌర సమాజంతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు మాట్లాడారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన చేశారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులతో సమావేశమై  ప్రధానంగా యువత, విద్యార్థులు మేల్కొని ప్రజలు మత్తు పదార్థాలతో జీవితాలు బుగ్గి పాలు చేసుకోకుండా చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు.గంజాయి, తదితర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాల జోలికెళితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో  వివరించారు.100  రోజులలో డ్రగ్స్ నిర్మూలనకు  కార్యా చరణ ప్రణాళిక అమలు చేసి,  కర్నూలు జిల్లా ను డ్రగ్స్, గంజాయి రహిత కర్నూలు జిల్లా గా తీర్చి దిద్దుతామన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు తమ వంతు సామాజిక బాధ్యత గా  పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.

About Author