PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మున్సిపాలిటీ కమిషనర్ గా అనుపమ..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ గా కె. అనుపమ మంగళవారం మధ్యాహ్నం మున్సిపాలిటీ కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు.ఈమె ఆదోనిలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు.ఈమె గతంలో అనంతపురం జిల్లా పామిడి మున్సిపాలిటీ కమిషనర్ గా పనిచేస్తూ ఆదోనికి బదిలీ అయ్యారు.ఆదోని నుండి ఇక్కడికి బదిలీపై వచ్చినట్లు మున్సిపాలిటీ కమిషనర్ అనుపమ తెలిపారు.ఇక్కడ పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి సెలవుల్లో ఉన్నారని ఆమె అన్నారు.ఆమె కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆమె తెలిపారు.కార్యాలయ సిబ్బంది కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author